కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి(Finance Minister) నిర్మల సీతారామన్ వరుసగా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. NDA ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. విపక్షాల నినాదాల మధ్య బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు బహిష్కరిస్తూ వాకౌట్ చేశాయి.
ప్రధానాంశాలివే…
* లిథియం బ్యాటరీపై పన్ను తొలగింపు.. తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
* కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు… రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరుగుదల
* ప్రధానమంత్రి ధనధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
* బీమా రంగంలో 100 శాతం FDI
* కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపు… రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరుగుదల
* ప్రధానమంత్రి ధనధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
* కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం
* పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం
* ప్రభుత్వ స్కూళ్లల్లో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్
* అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు
* అంగన్వాడీ కేంద్రాలకు నూతన హంగులు
* భారతీయ భాష పుస్తకాలకు డిజిటల్ రూపం
* కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
* వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త మెడికల్ సీట్లు
* ఎనిమిది కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0 స్కీం
* క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, EV, బ్యాటరీ ఇండస్ట్రీస్ కు ప్రోత్సాహం