సాంకేతిక విద్య అభివృద్ధి, బలోపేతం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలతోపాటు తన పరిధిలోని కాలేజీలకు గాను ‘మెరిట్’ స్కీంకు రూ.4,200 కోట్లను కేబినెట్ కేటాయించింది. మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్ మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గా ‘మెరిట్(MERITE)’ను అభివర్ణిస్తారు. ఈ నిధుల ద్వారా 175 ఇంజినీరింగ్, 100 పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతి గదులు, ల్యాబ్ లు, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. 2025-2030కి గాను 7.5 లక్షల మంది విద్యార్థులు, 13 వేల మంది అధ్యాపకులు లబ్ధి పొందుతారు. ప్రతిభ(Performance) ఆధారంగా నిధులు విడుదలవుతుంటాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.