దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు రుణం అందించే పీఎం-విద్యాలక్ష్మీ పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం హామీతో రూ.7.5 లక్షల రుణం లభించనుండగా, అందులో 75 శాతం మేర బ్యాంకులకు సర్కారు గ్యారంటీ ఇవ్వనుంది. మోదీ కేబినెట్(Union Cabinet) బుధవారం ఈ స్కీంకు ఆమోదం తెలిపింది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం(Annual Income) ఉన్నవారికి దీన్ని వర్తింపజేయనుండగా, ఏటా 22 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. రూ.10 లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభించనుంది. పీఎం-విద్యాలక్ష్మీ వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.