లీకేజీ ఆరోపణలు, గందరగోళం ఏర్పడ్డా ‘నీట్(NEET)’ పరీక్షను రద్దు చేయబోం అంటూ కేంద్ర ప్రభుత్వం కరాఖండీగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘నీట్’ విషయంలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని, అలాంటప్పుడు పరీక్షలు రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని వివరించింది.
ఇప్పటికే…
ఈ విషయంలో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించడంతోపాటు నిందితుల్ని అరెస్టు కూడా చేసినట్లు కోర్టుకు కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్(DG) సుబోధ్ కుమార్ సింగ్ ను తొలగించడంతోపాటు పరీక్షల ట్రాన్స్ పరెన్సీపై ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఏడుగురితో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది.