వేడుకకు హాజరైన కేంద్రమంత్రి కుమార్తెను ఆకతాయిలు వేధించారు. మంత్రి ఫిర్యాదుతో.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. జల్గావ్(Jalgaon) జిల్లా కొఠాలి గ్రామంలో ‘సంత్ ముక్తాయ్ యాత్ర’కు.. కేంద్ర యువజన, క్రీడల మంత్రి రక్షా ఖడ్సే కుమార్తె హాజరయ్యారు. మంత్రి గుజరాత్ టూర్లో ఉండగా, యాత్రకు వెళ్లేందుకు కూతురికి పర్మిషన్ ఇచ్చారు. అక్కడకు వెళ్లాక ఆమె వెంటపడ్డ గ్యాంగ్.. ఫొటోలు, వీడియోలు తీసి హంగామా చేసింది. 30 నుంచి 40 మంది ఆకతాయిలు అమ్మాయిల్ని వేధించారు. ఫిబ్రవరి 24న సైతం అదే గ్రూపు తమ కూతుర్ని వెంబడించిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు మంత్రి. దుండగులు రాజకీయ కుటుంబాలకు చెందినవారని, త్వరలోనే పట్టుకుంటామని CM ఫడ్నవీస్ భరోసానిచ్చారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ విమర్శించారు.