నీట్(NEET UG-2024) పరీక్షల తీరుపై వస్తున్న ఆరోపణల మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఈ విషయంలో ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని ఆయన వివరణ ఇచ్చారు. అవసరమైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)పైనా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
‘నీట్’ అవకతవకలపై బిహార్ సర్కారుతో చర్చిస్తున్నామన్న ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan).. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడమే తమ ధ్యేయమన్నారు. ఇప్పటికే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడం దీనిపై కేంద్రంతోపాటు NTAకు నోటీసులు ఇవ్వడం, దేశవ్యాప్తంగా విపక్షాలు(Opposition Parties) ఆరోపణకు దిగడంతో కేంద్రం స్పందించక తప్పలేదు.
డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్…
నీట్ పేపర్లు బిహార్లో లీకయ్యాయని వస్తున్న వార్తలపై అక్కడి ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా సంచలన కామెంట్స్ చేశారు. నీట్ పేపర్ లీక్ అనేది హైలెవెల్లో జరిగిన అక్రమమని, ఇందులో పెద్ద తలకాయల పాత్ర ఉందన్నారు. ఇందులో RJD లీడర్ తేజస్వియాదవ్ పాత్ర ఉందని, ఎందరో టాలెంట్ కలిగిన విద్యార్థుల జీవితాలతో ఆయన ఆటలాడుకున్నారంటూ డైరెక్ట్ గా విమర్శించారు.