అసంఘటిత(Unorganised) రంగం సహా పౌరులందరికీ అందుబాటులో ఉండేలా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్(UPS)పై కేంద్రం దృష్టిపెట్టింది. నిర్మాణ, గిగ్, ప్లాట్ ఫాంతోపాటు అన్ని రంగాల్లోని వర్కర్లకు సరైన పథకాలు లేవు. వేతనాలు, స్వయం ఉపాధి పొందేవారికి లాభించేలా UPSను రూపొందించే పనిలో కార్మిక శాఖ ఉంది. అయితే ఈ కొత్త స్కీంలో కంట్రిబ్యూషన్ స్వచ్ఛందంగానే ఉండనుంది. ప్రభుత్వం తరఫున ఎలాంటి కంట్రిబ్యూషన్ ఉండబోదని తెలుస్తోంది. ప్రతిపాదనలు పూర్తయితే వాటాదారులతో సంప్రదింపులు జరుగుతాయి. అసంఘటిత రంగంలో ప్రస్తుతానికి కొన్ని పథకాలున్నాయి. 60 ఏళ్లు నిండితే రూ.1,000-1,500 అందించే అటల్ పెన్షన్ యోజన, ప్రధాని శ్రమ్ యోగి మంధన్ యోజన ఉన్నాయి. రూ.3,000 ఇచ్చే పీఎం కిసాన్ మంధన్ యోజన రైతుల కోసం ఉద్దేశించింది.