ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి(Emotional) గురయ్యారు. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట జరిగి 30 మంది మృతిచెందడంతో ఆయన ఆవేదనతో మాట్లాడారు. మంగళవారం(ఇవాళ్టి) మౌని అమావాస్య అమృతస్నానాల కోసం నిన్న రాత్రి 7 గంటల నుంచే కోట్లాదిగా భక్తుల రాక ప్రారంభమైందన్నారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు ఆచరించేందుకు పోటీపడటంతో గందరగోళం ఏర్పడింది. అఖారా మార్గ్ లో బారికేడ్లు తోసుకుని లోపలికి రావడంతో ఏం జరుగుతుందో తెలియక తొక్కిసలాట ఏర్పడిందని యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) చెప్పారు.
న్యాయ విచారణ…
మృతులు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ సర్కారు.. తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించింది. జస్టిస్ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ DG వి.కె.గుప్తా, రిటైర్డ్ IAS డి.కె.సింగ్ తో కూడిన ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ ఎంక్వయిరీ కమిటీని ప్రకటించింది.