హిందువులు క్షేమంగా ఉంటే ముస్లింలు భద్రంగా ఉంటారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు మాట్లాడారు. ఆయన మాటల్లోనే…
‘ఎక్కడైతే హిందువులు భద్రమో అక్కడ ముస్లింలు క్షేమం.. అందరూ హ్యాపీగా ఉండాలి.. కానీ హిందూ మతాన్ని కించపరుస్తున్నారు.. 100 హిందూ ఫ్యామిలీలున్న చోట ఒక ముస్లిం కుటుంబం భద్రంగా ఉంది.. కానీ 100 ముస్లిం ఫ్యామిలీలున్న ప్రాంతంలో 50 హిందూ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయా..?. ఉండట్లేదు.. బంగ్లాదేశ్ ఉదాహరణ.. అంతకుముందు పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్ లో ఏం జరుగుతోంది.. 2017లో UPలో BJP అధికారం చేపట్టాక ఒక్క మతకల్లోలం జరగలేదు.. 2017కు ముందు హిందూ-ముస్లింల షాప్ లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.. ఇప్పుడెక్కడన్నా చూస్తున్నామా.. నేనో సామాన్య పౌరుణ్ని.. సనాతన ధర్మం ఎంతో పురాతనమైంది.. హిందూ పాలకుల గురించి చరిత్ర లేకుండా చేశారు..’ అని మాట్లాడారు.