బెంగాల్ అల్లర్లకు సరైన మందు దండించడమేనని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అల్లర్లకు పాల్పడ్డ ప్రతి ఒక్కణ్నీ దండించడమొక్కటే సరైన మార్గమని గుర్తు చేశారు. ‘బెంగాల్ కాలిపోతోంది.. కానీ CM మమత సైలెంట్ గా ఉన్నారు.. అల్లర్లకు పాల్పడ్డవారిని అంబాసిడర్లుగా ఆమె చూస్తున్నారు.. సెక్యులరిజం పేరిట స్వేచ్ఛ ఎక్కువైంది.. ఒక్కొక్కణ్ని పట్టుకుని కర్ర(Stick)తో ఉరికిస్తే తప్ప పరిస్థితి మారదు.. 2017కు ముందు యూపీలోనూ ఇలాగే ఉండేది.. రెండు మూడు రోజులకోసారి అల్లర్లు జరిగేవి.. BJP అధికారంలోకి వచ్చాక దండనే మంత్రంగా పనిచేసింది..’ అని అన్నారు.