నేరం చేసిన వాళ్లను హడలెత్తించడమే కాదు.. నేరం(Crime) చేయాలన్నా భయపడే విధంగా శిక్షలను అమలు చేస్తున్న యోగి సర్కారు ఉత్తరప్రదేశ్ లో మరో కఠిన చట్టాన్ని(Act) అమల్లోకి తేబోతున్నది. ఇప్పటికే ఎన్ కౌంటర్లకు ప్రసిద్ధి చెందిన UPలో ఈ కొత్త యాక్ట్ అమల్లోకి వస్తే మాత్రం నేరాలకు పాల్పడేవారికి రెండేళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్షతోపాటు, కోటి రూపాయల జరిమానా పడక తప్పదు.
ఆర్డినెన్స్ కు ఆమోదం…
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆర్డినెన్స్-2024 పేరిట చట్టం తెచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిపాదనలు(Proposals) సిద్ధం చేసింది. ఈరోజు సమావేశమైన కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. పేపర్ లీకేజీల్లో నేరస్థులు భయపడేలా కఠిన చట్టాలు తెస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో CM హామీ ఇచ్చారు. ఈరోజు 44 బిల్లులు ప్రవేశపెడితే అందులో ఈ ఎగ్జామ్స్ ఆర్డినెన్స్ ఉంది.
ఉత్తర్ ప్రదేశ్ లో లీకైన పరీక్షలివే…
* 60,244 కానిస్టేబుల్ పోస్టులకు 48 లక్షల మంది రాసిన రిజర్వ్ సివిల్ పోలీసు పరీక్షలు ఫిబ్రవరి 18, 19 తేదీల్లో జరిగాయి. ఇవి లీకవడంతో అదే నెల 24న ఎగ్జామ్ ను రద్దు చేశారు. నిర్వహించిన సంస్థను బ్లాక్ లిస్టులో చేర్చి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై చర్యలు తీసుకున్నారు.
* 2,500 కేంద్రాల్లో జరిగే పరీక్ష కోసం 20 లక్షల మంది అప్లై చేసుకున్న సర్కారీ టీచర్ల రిక్రూట్మెంట్ UPTET-2021 లీకైంది. యూపీ బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డు(UPBEB) నిర్వహించే ఈ పేపర్ బయటకు రావడంతో గందరగోళం ఏర్పడింది.
* 2024 ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసర్ RO/ARO పేపర్లను ఆరుగురు వ్యక్తులు లీక్ చేసినట్లు నాలుగు నెలల తర్వాత మొన్న బయటపడింది.
* 2024 మార్చిలో ఇంటర్ కు సంబంధించి బయాలజీ, మ్యాథ్స్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో దర్శనమిచ్చాయి.