ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాల భర్తీ(Recruitment) చేపట్టే యూనియన్ పబ్లిస్ సర్వీస్ కమిషన్(UPSC)… కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన మేరకు మే 26న ప్రిలిమ్స్ జరగాల్సి ఉండగా.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న(Elections) దృష్ట్యా వాటిని వాయిదా వేయాలని నిర్ణయించింది.
జూన్ 16న…
వాయిదా వేసిన ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 16న UPSC నిర్వహించనుంది. ఏడు దశల్లో(Seven Phases)లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19 నుంచే మొదలవుతుంది. దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘం ఈనెల 16 నాడు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరీక్ష నిర్వహణకు సాధ్యం కాదని భావించిన కమిషన్… వాటిని వాయిదా వేసింది.
ఈ సంవత్సరానికి…
ఈ ఏడాదికి గాను 1,056 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది UPSC. మరో 150 పోస్టుల్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కింద ప్రకటించింది. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ల ద్వారా అభ్యర్థుల సెలక్షన్ జరుగుతుంటుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేపడుతుండగా.. ప్రధాన(Mains) పరీక్షల్ని సెప్టెంబరు 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. 21 ఏళ్లకు తక్కువ కాకుండా 2024 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లు పూర్తి కాని వారు ఈ పరీక్షలకు అర్హులు.