సివిల్స్ సర్వీసెస్-2025 కోసం నోటిఫికేషన్ ను UPSC(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుండగా, మొత్తం 979 పోస్టులను భర్తీ చేస్తారు. IFS(ఇండియన్ ఫారిన్ సర్వీస్), IAS, IPS సహా వివిధ కేడర్లు భర్తీ చేయనుండగా, గతేడాది కన్నా ఈసారి పోస్టుల సంఖ్య తగ్గింది. 2024లో 1,056 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, ఈసారి 77 పోస్టులు తగ్గాయి. మే 25న ప్రిలిమ్స్ పరీక్షలు జరగనుండగా, దరఖాస్తుకు చివరి తేదీ 2025 ఫిబ్రవరి 11గా నిర్ణయించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయినవారు అర్హులు. వీటితోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) కోసం 150 పోస్టులకు సైతం ప్రకటన విడుదల చేసింది.
నిబంధనలివే…
* జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 సంవత్సరాల వయసు లోపు ఆరు సార్లు మాత్రమే సివిల్స్ రాయాల్సి ఉంటుంది.
* OBC అభ్యర్థులు 35 ఏళ్ల వయసు వరకు తొమ్మిది సార్లు సివిల్స్ రాయొచ్చు.
* SC/ST అభ్యర్థులు 37 ఏళ్లు వచ్చే వరకు ఎన్నిసార్లయినా పరీక్షలు రాయవచ్చు.
* దివ్యాంగులు(PwBD-పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్) 42 ఏళ్ల వరకు 9 సార్లు రాయడానికి వీలుంది.
* EWS అభ్యర్థులు 32 సంవత్సరాలు వచ్చే వరకు ఆరు సార్లు పరీక్షలు రాసేందుకు అనుమతి ఉంది.