
Published 28 Nov 2023
సొరంగం(Tunnel)లో చిక్కుకుని 17 రోజులైంది. లోపల ఎలా ఉన్నారో ఏమోనన్న సందేహానికి తోడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు చేసిన పూజలు ఫలించాయి. ఉత్తరాఖండ్(Uttarakhand) ఉత్తర కాశీ(North Kasi)లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు ఎట్టకేలకు బయటపడ్డారు. ఈ నెల 12న సొరంగంలో పనిచేస్తున్న సమయంలో అది కొద్దిగా కుప్పకూలడంతో 41 మంది అందులోనే చిక్కుకుపోయారు. కూలీలు ఉన్న చోటకు డ్రిల్లింగ్ చేసి పైపులు వేసి వాటి ద్వారా బయటి ప్రపంచానికి తీసుకువచ్చారు. తొలుత 57 మీటర్ల మేర అగర్ మిషన్ తో డ్రిల్లింగ్ చేసినా 47 మీటర్లకే దాని బ్లేడ్లు విరిగిపోయాయి. అయినా వెనుకడుగు వేయకుండా అగర్ మిషన్ బ్లేడ్లను కట్ చేసి ఆల్టర్నేటివ్ గా ఈసారి కొండపై నుంచి డ్రిల్లింగ్ చేశారు.
ర్యాట్ హోల్ మైనర్లతో డ్రిల్లింగ్
బొగ్గు గనుల్ని తవ్వే నిపుణులైన ర్యాట్ హోల్ మైనర్లను 12 మందిని రప్పించి 57 మీటర్ల మేర డ్రిల్లింగ్ కంప్లీట్ చేశారు అందులోని పైపుల ద్వారా మొత్తం బాధితులందర్నీ బయటకు తీసుకురాగలిగారు. అప్పటికే రెడీగా ఉంచిన అంబులెన్సులో వారందరినీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.