అయోధ్య కొలువైన లోక్ సభ MP వెక్కివెక్కి ఏడ్చారు. రాముడు, సీత ఎక్కడంటూ భోరున విలపించడంతో అక్కడున్న వారంతా ఓదార్చారు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్(Faizabad) పార్లమెంటు సభ్యుడు అవధేశ్ ప్రసాద్ ఎందుకిలా ఏడ్చారంటే…
అసలు కారణమిదే…
22 ఏళ్ల మహిళ అయోధ్య సమీపంలో అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించిన సమాజ్ వాదీ పార్టీ MP అవధేశ్.. ఆమెకు న్యాయం జరగట్లేదంటూ భోరున విలపించారు. ‘నేను ఢిల్లీ వెళ్తా.. ప్రధాని ఎదుటే లోక్ సభలో ప్రస్తావిస్తా.. ఆడబిడ్డల్ని కాపాడటంలో మనం ఫెయిలవుతున్నాం.. మన పిల్లలకు ఎందుకిలా అన్యాయం జరుగుతోంది.. మర్యాద పురుషోత్తముడు రాముడు, మాత సీతాదేవి మీరు ఎక్కడున్నారు.. ఇక నేను రాజీనామా చేస్తా..’ అంటూ ఆవేదనతో మాట్లాడారు.
అయోధ్య పరిధిలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. CM యోగి ఆదిత్యనాథ్, SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. అయోధ్య సమీపంలోని కెనాల్ లో మహిళ మృతదేహం గుర్తించగా.. ఆధ్యాత్మిక వేడుక కోసం ఇంటినుంచి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. బాధితురాలిని వివస్త్రను చేసి శరీర భాగాల్ని ఛిద్రం చేసిన దుండగులు అమానవీయ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించగా, ఫైజాబాద్ సెగ్మెంట్ పరిధిలోనే అయోధ్య ఉంది.