వాలంటైన్స్ డేను గుర్తు చేసుకుంటూ ప్రేయసీ ప్రియులు సర్ ప్రైజ్ గిఫ్టులు(Gifts) ఇస్తుంటారు. మరికొందరైతే షాపింగ్ లు, సినిమాలు, లాంగ్ డ్రైవ్ లంటూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక యువతి మాత్రం తన మాజీ బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అతడికి ఇష్టమైన 100 పిజ్జా(Pizza)లను ఆర్డర్ పెట్టింది. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ కింద. ఆ పిజ్జాలను డెలివరీ బాయ్ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి డోర్ ముందు పెట్టాడు. తలుపు తట్టి పిజ్జాల ఆర్డర్ అని చెప్పడంతో ఎదుటి వ్యక్తి షాకయ్యాడు. తాను ఆర్డర్ ఇవ్వలేదని చెప్పడంతో.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో జరిగిన ఈ ఘటనలో చివరకు అది తన ఎక్స్ పని అని తెలుసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, భలే ట్విస్ట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. మరికొందరేమో.. వామ్మో ఇదేం శాడిజం భయ్యా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.