మేఘాలకు చిల్లులు(Cloud Burst) పడి నదులు ఉప్పొంగడంతో ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ(Uttarakashi) జిల్లా అల్లకల్లోలమైంది. వరదలకు తోడు కొండ చరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మంది ఆచూకీ దొరకలేదు. 20 సెకన్లలోనే ధరాలి(Dharali) గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఏరియల్ వ్యూ నిర్వహించి భారీ యెత్తున పోలీసులు, సైన్యాన్ని దింపారు. ఆయనతో ప్రధాని మోదీ మాట్లాడారు. ధరాలి, సుఖి గ్రామాల్లోని బురదలో వందలాది మంది చిక్కుకుపోయారు. ఛార్ ధామ్ యాత్రలో ఒకటైన గంగోత్రికి వెళ్లే భక్తులు.. ధరాలిలోనే బస చేస్తారు. మూణ్నాలుగు అంతస్తుల భవనాలు జాడ లేకుండా పోయాయి.