మహారాష్ట్రలోని నాగపూర్(Nagpur)లో అల్లర్లు జరిగి విధ్వంసం(Vandalism) చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడటంతో అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. నగరంలోని మహల్ ప్రాంతంలో ఇళ్లు తగులబెట్టడం, వాహనాలు కాల్చివేయడం వంటి ఘటనలు జరిగాయి. సోమవారం రాత్రి పరిస్థితి చేయి దాటిపోవడంతో భారీయెత్తున బలగాల్ని దించారు. ఫైరింజన్ల సిబ్బంది సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. నాగపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని CM దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు.