దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఐదో విడత పోలింగ్ లో తొలి రెండు గంటల్లో 10.28 శాతం ఓటింగ్(Voter Turnout) నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికం(Highest)గా పశ్చిమబెంగాల్(15.35%)లో ఓట్లు పడ్డాయి. అతి తక్కువగా మహారాష్ట్ర(6.33%)లో ఓట్లు పోలయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల(Union Territories)లో పోలింగ్ నడుస్తున్నది.
ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు లోక్ సభ ఎన్నికలతోపాటు ఓటింగ్ కొనసాగుతున్నది. ఎక్కువగా UPలో 14, మహారాష్ట్రలో 13 స్థానాలు ఉండగా పశ్చిమబెంగాల్ లో ఏడింటికి ఓటింగ్ జరుగుతున్నది. ఏడు విడతలకు గాను ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13న నాలుగు దశలు పూర్తయ్యాయి. ఇవాళ ఐదో విడతతోపాటు మే 25న ఆరు, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరుగుతుంది.