ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. 10 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. ఇప్పటికే NDA, ఇండీ కూటమిల్లోని పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. NDA తరఫున సి.పి.రాధాకృష్ణన్, ఇండీ అలయెన్స్ నుంచి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. మెజార్టీ పరంగా చూస్తే రాధాకృష్ణన్ కే విజయావకాశాలున్నాయి. సాయంత్రం ఆరింటి తర్వాత లెక్కింపు(Counting) ప్రారంభిస్తారు. 771 మంది MPలు ఓటు వేయనుండగా.. BRS, JDS పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు ఎలక్టోరల్ కాలేజీలో 11 ఓట్లున్నాయి.