వక్ఫ్ సవరణ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే(Sessions) ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లును తీసుకురాబోతున్నట్లు ప్రతిపక్షాల(Opposition Parties)కు కేంద్రం తెలియజేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు గాను ఈ బిల్లు తేనుండగా.. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వక్ఫ్ బిల్లుపై ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఏర్పాటు చేయగా, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. 14 సవరణలతో ఫైనల్ రిపోర్టును తయారు చేసిన జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ.. దాన్ని లోక్ సభ స్పీకర్ కు అందజేసింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపట్నుంచి(జనవరి 31) నుంచి మొదలవుతాయి. ఈ సవరణ బిల్లును ఇప్పటికే JPC ఆమోదించగా, విపక్ష MPలతో కలిపి 44 మార్పులు సూచించగా, 14 సవరణలకు కమిటీ ఆమోదించింది. రేపటి సమావేశాల కోసం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరుగుతోంది.