వక్ఫ్ బోర్డుల సమాచారాన్ని(Information) ఇక కంప్యూటరైజ్డ్ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు(Waqf Amendment Bill-2024)ను మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ బిల్లుకు NDA పక్షాలు మద్దతు తెలిపితే.. కాంగ్రెస్, MIM, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకించాయి.
వక్ఫ్ చట్ట సవరణ.. ముస్లిం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలియజేశారు. ఏ మతమైనా సరే అందులోని స్వేచ్ఛను హరించేలా జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ ఉండబోదని స్పష్టం చేశారు. విస్తృత సంప్రదింపుల దృష్ట్యా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపుతున్నారు.
బిల్లులోని మిగతా అంశాలివే…
ముస్లింలలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం
వక్ఫ్ ఆస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ దుర్వినియోగం కాకుండా ఉండటం
వక్ఫ్ ఆస్తుల్ని పారదర్శకం(Fairly)గా గుర్తించడం(Identified)
బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వక్ఫ్ బోర్డు వ్యవహారాలు