వక్ఫ్ చట్ట సవరణ(Waqf Amendment) బిల్లును ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ‘క్వశ్చన్ అవర్’ ముగిసిన వెంటనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అంశంపై ఇప్పటికే పార్టీలన్నీ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. దీంతో BJP-కాంగ్రెస్ తోపాటు వివిధ పార్టీల MPలంతా సభకు హాజరయ్యారు. వక్ఫ్ కు ప్రపంచంలోనే అత్యధిక భూములున్న దేశం భారత్ అని.. అయినా ముస్లింలు ఎందుకు పేదలుగానే ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు. రైల్వే, రక్షణ రంగాల తర్వాత వక్ఫ్ బోర్డు భూములు మూడోస్థానంలో ఉన్నాయన్నారు. తాజా వక్ఫ్ బిల్లుతో 8.72 లక్షల ఎకరాల భూములు పేదల జీవితాల్ని మార్చుతాయన్నారు.