
ఈ ఏడాదిలో అత్యంత చీకటి రోజుగా ఆదివారం నిలవనుంది. డిసెంబరు 21న రాత్రి పూట మనం వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన చీకటి రానుండగా, 16 గంటలు రాత్రి, 8 గంటలు పగలు ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాల ఆయనాంతం(వింటర్ సోల్ స్టైస్) అంటారు. ఇది ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరమెక్కువ ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై అధిక కాలం ఉంటుంది. భూమి ఉత్తరార్ధ గోళంలో ఉన్నప్పుడు డిసెంబరు 20-23 తేదీల్లో ఆయనాంతం రానుండగా, ఈసారి 21న వస్తోంది. పుడమి తన అక్షం మీద తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించే సమయంలో.. ఉత్తరార్ధ గోళం దూరంగా వంగినపుడు ఈ పరిస్థితి వస్తుంది.