ఆమె మహిళా ఐఆర్ఎస్(IRS) అధికారి. తను పురుషుడిగా మారాలనుకుని లింగమార్పిడి కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతమిది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అన్ని అధికారిక రికార్డుల్లో ఇక తనను పురుష అధికారిగా చూడాలన్న అభ్యర్థన(Request)కు కేంద్రం ఓకే చెప్పింది. ఇది ఇండియన్ సివిల్స్ సర్వీస్ చరిత్రలో మొట్టమొదటిది.
అనసూయ టూ అనుకతిర్…
చెన్నైకి చెందిన IRS అధికారి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్ లోని కస్టమ్స్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో డిప్యుటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె చెన్నైలో బాధ్యతలు నిర్వర్తించిన ఎం.అనసూయ.. 2013లో సివిల్స్ కు సెలెక్టయ్యారు. కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో పురుషుడిగా మారి M.అనుకత్తీర్ సూర్యగా పేరు మార్చుకున్నారు.
ఆర్డర్స్ ఇష్యూ…
ఆమె పెట్టుకున్న దరఖాస్తుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్డర్స్ ఇచ్చింది. అనుకత్తీర్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో డిప్యుటీ కమిషనర్ ర్యాంకుకు చేరుకోగా.. గత సంవత్సరం హైదరాబాద్ కు వచ్చారు.