భారతదేశం అద్భుత గుర్తింపు సాధించింది. ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో అమెరికా(America), ఇంగ్లండ్ ను దాటింది. ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరెనీస్ పర్వతాల్లోని చిన్న దేశమైన అండోరా.. 84.7 స్కోరుతో మొదటి స్థానంలో ఉంది. ఈ రిపోర్టును నంబియో(Numbeo) సేఫ్టీ ఇండెక్స్-2025 ప్రకటించింది. UAE, ఖతార్, తైవాన్, ఒమన్ టాప్-5లో ఉన్నాయి. 66వ స్థానంలో భారత్ ఉంటే.. ఇంగ్లండ్ 87, అమెరికా 89 ప్లేసుల్లో నిలిచాయి. భద్రత లేని దేశాల్లో 19.3తో వెనెజులా, 19.7తో పపువా న్యూగినియా, 21.1తో హైతీ, 24.9తో అఫ్గానిస్థాన్, 25.3తో దక్షిణాఫ్రికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. https://justpostnews.com
ర్యాంక్ | దేశం | స్కోరు |
1 | అండోరా | 84.7 |
2 | యూఏఈ | 84.5 |
3 | ఖతార్ | 84.2 |
4 | తైవాన్ | 82.9 |
5 | ఒమన్ | 81.7 |
66 | భారత్ | 55.7 |
87 | ఇంగ్లండ్ | 51.7 |
89 | అమెరికా | 50.8 |