
కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు సీనియర్లు బీజేపీ సర్కారుకు మద్దతుగా మాట్లాడితే వారికి మరో ఇద్దరు జతకలిశారు. ఎల్పీజీ కొరత లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు. యూపీఏ పాలనలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆనంద్ శర్మ ఇంకో అడుగు ముందుకేసి.. ‘సంక్షోభాన్ని దౌత్యంతో భారత్ పరిష్కరించిన తీరు అద్భుతం.. జాతీయ ఐక్యత, ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం పరిణతితో స్పందించడం అవసరం..’ అని ప్రశంసించారు. ఇప్పటికే శశిథరూర్, మనీశ్ తివారీ పార్టీ తీరును విభేదించగా.. ఇప్పుడు ఈ ఇద్దరూ జతకవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది.