
‘టెండర్ ఓటు’ను లెక్కించకున్నా దానికి ఎంతో విలువుంది. ప్రతి పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఓటింగ్ సమయంలో ఒకరి ఓటును మరొకరు వేస్తే.. అసలు వ్యక్తి అవకాశం కోల్పోతారు. వేరే వ్యక్తి తన ఓటు వేశారని తెలిస్తే ‘టెండర్ ఓటు’ వేయొచ్చు. గుర్తింపులు చూపి ఓటేశాక ఆ వివరాల్ని భద్రపరుస్తారు. అసలు ఓటరు ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాక సాధారణ బ్యాలెట్ పేపర్ బండిల్లోని చివరి బ్యాలెట్ ను ఇస్తారు. టెండరు ఓటును బ్యాలెట్ బాక్సులో కాకుండా ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తారు. దీన్ని ఫలితాల కోసం లెక్కించరు కానీ రిజిస్టర్ లో నమోదు చేస్తారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో తప్పుడు ఓటు రికార్డవుతుంది. ఫలితాలకు సంబంధించి కోర్టుకు వెళ్లినపుడు ఆ పోలింగ్ కేంద్రంలో తప్పుడు ఓటింగ్ జరిగినట్లు నిర్ధరణకు ఉపయోగపడుతుంది. భద్రాచలం పోలింగ్ బూత్ లో ఓ మహిళ ఈరోజు టెండర్ ఓటు వేశారు.