
కాకతీయ(Kakatiya) యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయ క్రాస్ రోడ్డు వద్ద విద్యార్థులను కలుసుకున్నారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లను వేయట్లేదని కాంగ్రెస్ సర్కారుపై ఆమె విమర్శలు చేశారు. నిరుద్యోగుల సమస్యలతోపాటు జోనల్ అంశాలపై పోరాటం చేయాలని ఆమెకు వారు వివరించారు. నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు.. గత ప్రభుత్వ నోటిఫికేషన్లలోని ఉద్యోగాల్ని తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని కవిత అన్నారు.