కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల MLC స్థాన ఓట్ల లెక్కింపులో పదకొండో రౌండ్ పూర్తయింది. మొత్తం ఓట్లు 2,52,029 కాగా, అందులో 2,23,343 చెల్లినవి ఉన్నాయి. 28,686 ఓట్లు చెల్లనివి. కోటా నిర్ధారణకు 1,11,672 ఓట్లు అవసరం కాగా.. కమలం పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు.
అభ్యర్థులు-ఆధిక్యాలు ఇలా…
అంజిరెడ్డి – 4,935(ఓవరాల్ 75,675)
నరేందర్ రెడ్డి – 4,387(ఓవరాల్ 70,565)
ప్రసన్న హరికృష్ణ – 3,473(ఓవరాల్ 60,419)