కేంద్రంలో NDA కూటమి కొలువుదీరటం.. నిన్న ప్రధానిగా నరేంద్రమోదీ సహా మంత్రివర్గం బాధ్యతలు చేపట్టడం, ఈరోజు తొలి ఫైల్ పై సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. మూడోసారి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏం చేయబోతున్నామో ఎన్నికల మ్యానిఫెస్టో(Manifesto)లోనే ప్రజలకు వివరించిన కమలం పార్టీ.. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నది.
18 నుంచి సెషన్స్…
ఇక లోక్ సభ సమావేశాల్ని ఈ నెల 18 నుంచి నిర్వహించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ముందుగా ప్రొటెం స్పీకర్ తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం(Oath) చేయిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులందరి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించబోతున్నారు. ఈ ప్రక్రియంతా జూన్ 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముంది.
స్పీకర్ ఎన్నికను ఈ నెల 20న నిర్వహించే ఆలోచన ఉండగా.. ఆ మరుసటి రోజైన 21 నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభనుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈరోజు జరిగే కేంద్ర మంత్రిమండలి(Cabinet) సమావేశం తర్వాత ఈ సమావేశాలపై పూర్తి క్లారిటీ రానున్నట్లు తెలుస్తున్నది.