
అధికారం చేపట్టిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ హస్తం పార్టీ హవా నడిచింది. ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 24,500 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. 2024 జూన్ లో జరిగిన కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ లోనూ కాంగ్రెస్ గెలిచింది. అజహరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చి మైనార్టీల్ని మచ్చిక చేసుకోవడం, మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి ఇల్లిల్లూ తిప్పించడం అధికార పార్టీకి కలిసొచ్చిన అంశాలు. ఇక సిట్టింగ్ సీటులో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది BRS. మాగంటి గోపినాథ్ మృతిచెందినా సానుభూతిని ఒడిసిపట్టుకోలేకపోయింది.