
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డికి శాఖల్ని కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సమాచార, పౌర సంబంధాలు.. గనులు, భూగర్భ శాఖల్ని అప్పగించారు. ఈ శాఖలు ఇప్పటివరకు CM వద్దే ఉన్నాయి. అంతకుముందు మహేందర్ రెడ్డి.. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి CM కేసీఆర్ తోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు.