అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్(Gandhi Bhavan)కు వెళ్లారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసేందుకు ఆయన అక్కడకు చేరుకున్నారు. ఆయన 2024 ఫిబ్రరిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట నల్గొండ జిల్లా పెదవూర మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన.. శాసనసభ ఎన్నికల్లో BRS నుంచి నాగార్జునసాగర్ టికెట్ ఆశించారు. తనను గెలిపించేందుకు అల్లు అర్జున్ సైతం ప్రచారం చేస్తారని ప్రకటించారు. కానీ ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెణ్నెల్ల పాటు BRSకు దూరంగా ఉన్నారు. చివరకు ఈ ఫిబ్రవరిలో దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారం రోజులుగా అల్లు అర్జున్ కు ఎదురైన పరిస్థితుల దృష్ట్యా ఆయన గాంధీభవన్ కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.