BRS అధికారంలో ఉన్న సమయంలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలన(Power)లో రెండింటికీ మజ్లిస్ తో సంబంధాలు(Relations) ఉన్నాయని, ఆ రెండు పార్టీలు ఒకటే అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి ఆ రెండు పార్టీలు భయపడ్డాయంటే అందుకు కారణం MIM అని విమర్శించారు. మెదక్ సభకు హాజరైన ఆయన.. BJP అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
ఇక శాశ్వతంగా…
కశ్మీర్ ను భారత్ లో శాశ్వతం(Permanently)గా అంతర్భాగం చేసేవరకు మోదీ విశ్రమించబోరని అమిత్ షా గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి రాగానే OBC, SC, ST రిజర్వేషన్లు తీసుకువస్తామని, రాష్ట్రంలో 12 స్థానాల్లో కమలం పార్టీని గెలిపించాలని కోరారు.