తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి దండం పెట్టుకుని రాష్ట్రంలో అడుగుపెట్టానని, వచ్చే ఎలక్షన్లలో KCR సర్కారు తప్పక కుప్పకూలుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భక్తుల మనోభావాల్ని కేసీఆర్ కించపరుస్తున్నారని, కారు స్టీరింగ్ కు దెబ్బ పడుతుందని కామెంట్ చేశారు. తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని, ఒవైసీ పక్కన కూర్చుని కేసీఆర్ అమరవీరులను అవమానిస్తున్నారని విమర్శించారు. ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో ఖమ్మంలో నిర్వహించిన సభకు అమిత్ షా హాజరయ్యారు. కె.చంద్రశేఖర్ రావు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా అంటూ సభకు హాజరైన వారిని అడిగారు. వారంతా లేదు లేదు అనడంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది ప్రధాని నేతృత్వంలో తమ పార్టీ లీడరేనని అన్నారు.
కేసీఆర్ ది 2జీ పార్టీ.. ఒవైసీది 3జీ పార్టీ
కాంగ్రెస్ ది 4జీ పార్టీ, కేసీఆర్ BRS 2జీ పార్టీ(కేసీఆర్, కేటీఆర్), ఒవైసీది 3జీ అని కానీ BJPది కేవలం సింగిల్ జీ ప్రజల పార్టీ అని అమిత్ షా అన్నారు.