కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ చేరుకుని అక్కణ్నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం రానున్నారు. అక్కడ శ్రీరామచంద్రుల వారిని దర్శించుకున్న అనంతరం ఖమ్మంలో’రైతు గోస – భాజపా భరోసా’ పేరుతో నిర్వహించే సభకు అటెండ్ అవుతారని BJP స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి తెలిపారు. BRS ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు KCR కుటుంబానికి లేదన్నారు. పంటల బీమా పథకం రాష్ట్రంలో సరిగా అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
అవార్డీలకు అభినందనలు
కేంద్రం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నిలవడంపై ఆయనకు కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. పుష్ప, ట్రిపుల్ ఆర్ సహా అవార్డులు పొందిన చిత్రాలపై ఆయన పొగడ్తలు కురిపించారు.