వాజ్ పేయీ నిజాయతీతో వ్యవహరించి ఒక్క ఓటు తేడాతో పదవీత్యాగం చేశారని, కానీ వాజ్ పేయీ తలచుకుంటే గనుక అవిశ్వాసాన్ని అప్పట్లో ఈజీ(Easy)గా నెగ్గేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ట్రాన్స్ పరెన్సీతో అవిశ్వాసాన్ని ఎదుర్కొని ఒక్క ఓటుతో ప్రధాని పదవి నుంచి వాజ్ పేయి దిగిపోయారని, ఒడిశా CMగా ప్రమాణం చేసిన ఒక MP ఓటుతో ఆయన పదవిని త్యజించారని షా గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రతిపక్షాలకు దీటుగా అమిత్ షా జవాబిచ్చారు.
ఆనాడు నిజాయతీ, నిబద్ధతతో నిలిచినందుకే వాజ్ పేయీ మళ్లీ PM అయ్యారని కొనియాడారు. కానీ అందుకు భిన్నంగా PV నరసింహారావు ప్రభుత్వం MPలను కొనుగోలు చేసి అవిశ్వాసం నెగ్గిందని విమర్శించారు. చివరకు ఆ కేసులో MPల్లో చాలామంది జైలు పాలయ్యారని గుర్తు చేశారు. అవినీతి, కుటుంబ పాలనను మోదీ అంతం చేస్తున్నారని అన్నారు. తొమ్మదేళ్లలో మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను తొమ్మిదో స్థానం నుంచి 5వ ప్లేస్ కు తీసుకువచ్చారని హోంమంత్రి స్పష్టం చేశారు.