కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి మరో కీలక పదవి దక్కింది. కమలం పార్టీలో ఇప్పటికే ముఖ్య పదవులు దక్కించుకున్న ఆయన.. మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్(Secunderabad) నుంచి గెలిచి మంత్రి పదవి పొందిన సంగతి తెలిసిందే. అటు కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ బాధ్యతలు చూస్తున్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిలను ప్రకటించిన BJP అధిష్ఠానం.. కిషన్ రెడ్డికి పెద్ద రాష్ట్రాన్ని అప్పగించింది.
జమ్మూకశ్మీర్ కు…
కిషన్ రెడ్డిని జమ్మూకశ్మీర్ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జిగా నియమిస్తూ BJP హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో మూడింటికి సహ ఇంఛార్జి(Co-Incharges)ను ప్రకటించిన పార్టీ.. కిషన్ రెడ్డికి మాత్రం సహ ఇంఛార్జిని ఇవ్వలేదు. 4 రాష్ట్రాలకు ఏడుగురిని ప్రకటిస్తే అందులో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ CM ఉన్నారు.
రాష్ట్రం | ఇంఛార్జి పేరు | సహ ఇంఛార్జి పేరు |
జమ్మూకశ్మీర్ | జి.కిషన్ రెడ్డి | —– |
హరియాణా | ధర్మేంద్ర ప్రధాన్ | విప్లవ్ కుమార్ దేవ్ |
ఝార్ఖండ్ | శివరాజ్ సింగ్ చౌహాన్ | హిమంత బిశ్వశర్మ |
మహారాష్ట్ర | భూపేంద్రయాదవ్ | అశ్వినీ వైష్ణవ్ |