భారత్ రాష్ట్ర సమితి(BRS)కి మరో MLA గుడ్ బై చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం హస్తం పార్టీలో చేరుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శించుకున్న రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాశ్ గౌడ్.. తాను పార్టీ మారుతున్నట్లు అక్కడే ప్రకటించారు. రాత్రి 7 గంటలకు CM చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని తెలిపారు.
ఎనిమిదో వ్యక్తి…
ఇప్పటికే ఏడుగురు MLAలు బీఆర్ఎస్ విడిచి వెళ్లారు. దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ), సంజయ్ కుమార్(జగిత్యాల), కాలె యాదయ్య(చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల)కి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే జత కలుస్తున్నారు.
రూలింగ్ తోనే…
రూలింగ్ పార్టీ వల్ల కొన్ని సమస్యలు తీరిపోతాయని నమ్మే కారు దిగుతున్నట్లు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మమల్ని బెదిరించే అవసరం లేదని, తాము చిన్న పిల్లలం కాదన్నారు.