
ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలంటే చులకన అని, నిన్న ప్రకటించిన టికెట్ల లిస్టును చూస్తే అది అర్థమవుతోందని BJP సీనియర్ లీడర్ DK అరుణ విమర్శించారు. ’33 శాతం రిజర్వేషన్లు కావాలంటూ ముఖ్యమంత్రి బిడ్డ ఢిల్లీలో హడావుడి చేశారు.. లిక్కర్ స్కామ్ ఆరోపణల్ని పక్కదారి పట్టించడానికి రిజర్వేషన్ల పేరిట దీక్ష చేశారు.. రాష్ట్రంలో మహిళలకు 3 శాతం సీట్లివ్వడంపై తండ్రికి కవిత ఎందుకు చెప్పలేకపోయారు’ అంటూ అరుణ విమర్శించారు. మహిళా బిల్లును తొలుత ప్రవేశపెట్దింది BJPయేనని, ఇప్పటివరకు రెండు సార్లు బిల్లును తీసుకువచ్చారని తెలిపారు. కేంద్ర కేబినెట్ లో 12 మంది మహిళలు ఉన్నారని, కీలకమైన ఆర్థిక శాఖను మహిళ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. భారతదేశ రాష్ట్రపతిగానూ ద్రౌపదీ ముర్మును ఎంపిక చేసింది కమలం పార్టీయేనన్నారు.
ఈ ప్రభుత్వంలో అధికారులకు రాజకీయ పిచ్చి పట్టుకుందని అరుణ ఫైర్ అయ్యారు. పాలిటిక్స్ లోకి రావాలనుకుంటూ కాళ్లు మొక్కడం, సాష్టాంగ నమస్కారాలు చేయడం చూస్తే సిగ్గుగా ఉందన్నారు. IAS అధికారులు కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారని, పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఉద్యోగాలు మానేసి పార్టీల్లో చేరాలన్నారు.