మాజీ ముఖ్యమంత్రి(Former CM) కేసీఆర్ కంటే ఆయన తనయుడు కేటీఆరే ఎక్కువగా దాదాగిరి చేశారని BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గత ప్రభుత్వంలో KCR కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీ రామారావేనని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్.. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లకు కేటీఆర్ చేసిందేమీ లేదన్నారు.
నేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంపై BRS సర్కారు ఏ మాత్రం పట్టించుకోలేదని, వాళ్లకు ఇచ్చిన హామీల్లో ఏవీ నెరవేర్చలేదని సంజయ్ అన్నారు. 50 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి నేతన్నల్ని నిలువునా మోసం చేశారన్నారు.