స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. కేంద్రం ఇచ్చే నిధుల కోసమే ఎలక్షన్లు అని విమర్శించారు. ‘PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను ఎవరైనా గుర్తు పడ్తరా.. కాంగ్రెస్ సర్కారు వచ్చాక పంచాయతీలకు ఒక్క పైసయినా ఇచ్చిందా.. రాత్రిపూట యాత్రలు చేయడమేంటో అర్థం కావట్లేదు.. BC రిజర్వేషన్లు ఇవ్వమంటే ముస్లిం రిజర్వేషన్లిస్తారు.. ఉపరాష్ట్రపతిగా BCని నిలబెడితే వీళ్లు ఓడిస్తారు..’ అంటూ సంజయ్ ఆరోపించారు.