ఎవరో చెప్తే అధ్యక్షుణ్ని నియమించే పార్టీ BJP కాదని మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన మాటల్లోనే… ‘ఆ పదవి రానంత మాత్రాన డమ్మీ కాదు.. ప్రెసిడెంట్ పదవిని ఎవరైనా అడగొచ్చు.. ప్రతి ఒక్కరూ దాన్ని కోరుకోవడం తప్పు కాదు.. ఒకరిని అధ్యక్షుణ్ని చేశాక మిగతా వారంతా డమ్మీ అనడం సరికాదు.. చంద్రబాబో, ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుణ్ని పెట్టే పార్టీ BJP కాదు.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దు.. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, ఆయన లేకుంటే పార్టీ లేదు అన్నది మూర్ఖత్వమే’.