మతపర(Religious) రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విషయం తెలిసినా కేంద్రాన్ని బద్నాం చేయాలన్న కుట్రకు కాంగ్రెస్ యత్నిస్తోందని విమర్శించారు. BC జాబితాలో ఉన్న ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ముస్లింలను ఈ కేటగిరీలో చేర్చడం వల్ల BC లకు రిజర్వేషన్లు లేకుండా పోతాయని, అలా చేస్తే హిందూ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుందన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదు.. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే పరిస్థితి లేదు.. మార్చిలోపు ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమన్న విషయం కాంగ్రెస్ కు తెలియదా.. 15వ ఆర్థిక సంఘం నిధులు(Grants) నిలిచిపోతాయని తెలిసినా ఎన్నికల్ని వాయిదా వేస్తున్నారు.. అలా ఇప్పటికే రెండు సార్లు నిధులు నిలిచిపోయాయి..’ అని సంజయ్ గుర్తు చేశారు.