CM రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి KTR పాదయాత్రలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఈ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర అని అన్నారు. ఆరు గ్యారంటీలతో ఓట్లు దండుకుని అధికారం(Power)లోకి వచ్చాక రేవంత్ మోసం చేశారని, గత పదేళ్లలో ప్రజల్ని అడుగడుగునా వంచించిన KTR తీరుపై సంజయ్ విమర్శలు చేశారు.
‘రెండు పార్టీలు ఒక్కటే కదా.. ఇద్దరూ కలిసి అటునుంచి ఇటు, ఇక్కణ్నుంచి అటు పాదయాత్రలు పెట్టుకోండి.. కలిసే బహిరంగసభ ఏర్పాటు చేసుకుని KCRను, సోనియాగాంధీని పిలుచుకోండి.. ప్రజల్ని మోసం చేసిన ఈ ఇద్దరికీ పాదయాత్ర చేసే దమ్ముందా..’ అంటూ సంజయ్ మండిపడ్డారు.