దుందుడుకు వ్యవహారశైలి.. ప్రత్యర్థి పార్టీల్ని గుక్కతిప్పుకోకుండా ఆటాడుకునే బండి సంజయ్.. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతున్నారు. కేంద్రమంత్రి అయిన తర్వాత ఆయన మాటల్లో పూర్తి మార్పు కనిపిస్తున్నది. తాజా కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది బండి స్టైల్…
ఆయన మాటల్లోనే …
‘ఎన్నికలైపోయినయ్.. ఇకపై ఒకరినొకరు తిట్టుకునుడు బంద్ చేద్దాం.. రాజకీయ విమర్శలు, ఆరోపణలు పక్కనపెట్టి అభివృద్ధి(Development)పై ఫోకస్ పెడదాం.. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే పురోగతి..’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సిరిసిల్లలో గుర్తు చేశారు.
‘కుల సంఘం ఆఫీసులు కడితే వాటి నాయకులకే ఉపయోగపడ్తయ్.. కానీ కుల సంఘాల తరఫున కళ్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ పనికొస్తయ్.. ఇలాంటి వాటికే MP ల్యాడ్స్ నిధులిస్తున్నా.. పేద కుటుంబాలను ఆదుకున్నప్పుడే కుల సంఘాలకు మనుగడ..’ అంటూ సంజయ్ హితబోధ చేశారు.