లోక్ సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ సర్కారు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టింది. మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లోనూ ఇది ఆమోదం పొందేలా NDA సర్కారు ఇప్పటికే వేగంగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అనూహ్యంగా తీసుకురావడం, తొలి భవనంలో మొదటి బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్ సభలో బుధవారం నాడు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది.
454 మంది అనుకూలంగా ఓటేయగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. ఇప్పుడు ఇదే వాతావరణం ఎగువ సభలోనూ ఉంటుందని మోదీ సర్కారు విశ్వసిస్తున్నది.