మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో(Results) BJP ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి దూసుకెళ్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రస్తుతానికి పూర్తిస్థాయి లీడ్ లో ఉంది. ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాలే మ్యాజిక్ ఫిగర్ ను దాటిపోయాయి. 288 స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్ లో ప్రస్తుతానికి కమలం కూటమి 221 నియోజకవర్గాల్లో జోరు మీదుంది. అటు ఇండీ కూటమి(I.N.D.I.A. Alliance)లోని మహా వికాస్ అఘాడి కేవలం 55 స్థానాల్లోనే పైచేయిగా ఉంది. BJP 149 చోట్ల పోటీచేసి 128 సెగ్మెంట్లలో హవా కొనసాగిస్తున్నది. NDAలోని శివసేన 53, NCP 36 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. హస్తం కూటమిలో కాంగ్రెస్ 23, శివసేన(UBT) 19, NCP(శరద్ పవార్) 14 చోట్ల మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి.
ఇక ఝార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా రిజల్ట్స్ వచ్చేలా ఉన్నాయి. మొత్తం 81 స్థానాలకు గాను 41 సీట్లు సాధించినవారు పీఠం దక్కించుకుంటారు. కాంగ్రెస్ కూటమిలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే NDA కూటమి 31 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ NDAదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.