మహారాష్ట్రలో జరిగిన శాసనమండలి(Lesislative Council) ఎన్నికల్లో అధికార BJP కూటమి ఘన విజయం సాధించింది. BJP-శివసేన-NCP జట్టు గల మహాయుతి అలయెన్స్ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే కమలం కూటమి తొమ్మిది చోట్ల గెలుపొందింది.
వాళ్లకు రెండే…
ప్రధాన విపక్ష కూటమి మహా వికాస్ అఘాడి(MVA)కి కేవలం రెండు సీట్లు దక్కాయి. BJP-శివసేన-NCP అలయెన్స్ పోటీ చేసిన 9 స్థానాల్లో విజయం సాధిస్తే.. మహా వికాస్ అఘాడి 3 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టి ఒకటి కోల్పోయింది. తమకు సరైన బలం లేకున్నా మూడో అభ్యర్థిని MVA బరిలోకి దించింది.
అధికార కూటమిలో క్రాస్ ఓటింగ్ జరిగి తమకు లాభిస్తుందని భావించినా అది జరగలేదు. దీంతో అత్యుత్సాహానికి పోయిన MVA కూటమి మూడో చోట ఓడిపోయింది.